స్వస్తిక్ న్యూస్, ఆంధ్ర ప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో ఇవ్వాళ తెల్లవారుజామున భూకంపం వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. పల్నాడు జిల్లాలోని వినుకొండ మరియు దర్శి ప్రాంతాలలో ఇవాళ తెల్లవారుజామున రిక్టర్ స్కేల్ పై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో.. భూమికి పది కిలోమీటర్ల లోతులో కేంద్రం ఉన్నట్లు తాజాగా EMSC, NCS ధ్రువీకరించాయి.

తెల్లవారుజాము సమయంలో వినకొండ నుంచి దర్శి వైపు అన్ని ప్రాంతాలలోనూ భూ ప్రకంపనల వల్ల వస్తువులు కదిలి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ భూ ప్రకంపనలను గుర్తించిన జనాలు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతానికి ఎటువంటి ఆస్తి మరియు ప్రాణ నష్టం జరగలేదు అని అధికారులు తెలిపారు. అయితే భవిష్యత్తులో ఈ ప్రాంతాలలో మరిన్ని భూప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరించారు. ఎవరు ఊహించినటువంటి విధంగా తక్కువ ప్రకంపనలతో భూకంపం సంభవించినప్పటికీ ప్రజల్లో మాత్రం ఒకంత భయం నెలకొంది.