స్వస్తిక్ న్యూస్,యర్రగొండపాలెం :-మార్కాపురం జిల్లా, దోర్నాల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు మరియు RWS SE ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు త్రాగునీరు అందించే RO ప్లాంట్ పూర్తిగా అశుభ్రంగా, నిర్వహణ లేకుండా ఉండటాన్ని గమనించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థుల ఆరోగ్యంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత స్కూల్ యాజమాన్యం మరియు అధికారులను వెంటనే పిలిపించి ఇలాంటి పరిస్థితులు మళ్లీ కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరిక చేశారు.పాఠశాలలో త్రాగునీటి శుభ్రత, విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని వెంటనే RO ప్లాంట్‌ను శుభ్రపరిచి సక్రమంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.స్కూల్ ఆవరణంలో వాహనాల పార్కింగ్ ను తొలగించాలని విద్యార్థులు కోరగా తక్షణమే తగిన చర్యలను తీసుకోవాలని స్థానిక SI కి ఎరిక్షన్ బాబు సూచనలు చేశారు. విద్యార్థుల సంక్షేమమే తమకు ముఖ్యమని, విద్యార్థుల సౌకర్యాల విషయంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి నిర్లక్ష్యాన్ని అసలు సహించబోమని గూడూరి ఎరిక్షన్ బాబు స్పష్టం చేశారు.
