మార్కాపురం జిల్లా :- మార్కాపురం జిల్లా, యర్రగొండపాలెం నియోజకవర్గం, దోర్నాల మండలం లోని చిన్న గుడి పాడు గ్రామం లో ఎన్టిఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది అని భరోసాని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా AMC చైర్మన్ చేకూరి సుబ్బారావు , దోర్నాల మండల అధ్యక్షులు షేక్ మాబు , MPDO , పంచాయతీ కార్యదర్శి శివ , అధికారులు మరియు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.
