స్వస్తిక్ న్యూస్, యర్రగొండపాలెం :- యర్రగొండపాలెం పట్టణం లోని కోలుకుల రోడ్డు లో నూతనంగా ప్రారంభించిన "శ్రీ రస్తు" షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. నూతన షాపింగ్ మాల్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం షాపింగ్ మాల్ లో ఉన్నటువంటి అన్ని రకాల దుస్తులను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ చేకూరి సుబ్బారావు, యర్రగొండపాలెం మండల అధ్యక్షులు చిట్యాల వెంగళ రెడ్డి మరియు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

