స్వస్తిక్ న్యూస్,యర్రగొండపాలెం :- హాశివరాత్రి పర్వదినోత్సవ వేళ భక్తిశ్రద్దలతో త్రిపురాంతకములోని శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గూడూరు ఎరిక్షన్ బాబు దర్శించుకున్నారు.

మొదటగా ఎర్రగొండపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి నేరుగా త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం కు చేరుకొని నూతనంగా నిర్మించిన తారు రోడ్డును ప్రారంభించారు.

అనంతరం త్రిపురాంతకంలో ఉన్న శ్రీ బాలా త్రిపురసుందరి దేవి ఆలయం లో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాగా గత కొన్ని సంవత్సరాలుగా మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ భారీ స్థాయిలో ఉత్సవాలు జరుపుతారు.

ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎక్కడా కూడా ట్రాఫిక్ కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.