స్వస్తిక్ న్యూస్, మార్కాపురం:- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 24వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు పురోగతి పనులను పరిశీలించనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. సీఎం రాకను దృష్టిలో ఉంచుకొని ఈరోజు వెలుగొండ ప్రాజెక్ట్ ను ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు , ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, సబ్ కలెక్టర్ పులి శ్రీనివాసులు , డిఎస్పి నాగరాజు , ఆర్డీఓ, యర్రగొండపాలెం సిఐ అజయ్ బాబు అందరూ కలిసి నేరుగా ఏర్పాట్లను పరిశీలించారు.

సీఎం వస్తున్న నేపథ్యంలో వెలుగొండ పరిసర ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

మరోవైపు ఇప్పటికే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పలుమార్లు వెలుగొండ ప్రాజెక్ట్ పనులను పరిశీలించడానికి వచ్చిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు పనులు వేగవంతంగా కొనసాగుతున్న వేల సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా రావడం.. ప్రాజెక్టుపై ఎటువంటి స్పష్టత ఇస్తారు అనే విషయంపై జిల్లా ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
