స్వస్తిక్ న్యూస్,యర్రగొండపాలెం :- ఈరోజు నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో... పరీక్షలు రాయబోతున్న విద్యార్థిని, విద్యార్థులకు యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, పూర్తి ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరుకుంటూ, మీరు కష్టపడి చదివిన దాన్ని ఇష్టంతో రాసి మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిచారు.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు మానసికంగా ధైర్యం చెప్పాలని అన్నారు. పరీక్షల సమయంలో ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. పరీక్షలు బాగా రాసి... మంచి ఉత్తీర్ణత సాధించి తల్లి తండ్రులకు, మీ అధ్యాపకులకు మంచి పేరు తెచ్చి వారి కలలను నిజం చేయాలని ఎరిక్షన్ బాబు సూచించారు. దూర ప్రాంతాల నుండి పరీక్ష సెంటర్ వెళ్లే విద్యార్థులకు కూటమి నేతలు సహకరించాలని కోరారు.ఇంటర్మీడియట్ పరీక్షలు విజయవంతంగా పూర్తిచేసి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు ఎరిక్షన్ బాబు గారు ఆశీర్వాదాలు అందజేశారు.