స్వస్తిక్ న్యూస్, త్రిపురాంతకం :- యర్రగొండపాలెం నియోజకవర్గం, త్రిపురాంతకం లో ఈరోజు ఉదయం 9 గంటలకు శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి మరియు బాల త్రిపురసుందరి దేవి అమ్మవారి ఆశీస్సులతో "ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ "గూడూరి ఎరిక్షన్ బాబు" పాల్గొని ఎడ్ల పందాలను ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ.. గ్రామీణ సంస్కృతి, సంప్రదాయ క్రీడలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రైతుల గర్వకారణమైన ఒంగోలు జాతి ఎడ్ల శక్తి, సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే వేదికలుగా ఇటువంటి కార్యక్రమాలు నిలుస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో త్రిపురాంతకం మండలం టీడీపీ కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, మరియు ఎడ్ల పందాలు నిర్వహణ కమిటీ సభ్యులతో పాటుు భారీ ఎత్తున మార్కాపురం జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వచ్చి మరి వీక్షిస్తున్నారు.
