యర్రగొండపాలెం :- సభ్య సమాజం సిగ్గుపడేలా అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఉన్నాయి అని యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా ఆ పార్టీ నేతల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసి ఇంకా సిగ్గు లేకుండా బుకాయిస్తారా?.. అంటూ తీవ్రంగా మండిపడ్డారు. గొడవలు రాజేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగజేసేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్ తో పాటుగా తన నాయకులు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. ఈ నేపద్యంలోనేే వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి అని.. లేకుంటే ప్రజలే తరిమి కొడతారని వ్యాఖ్యానించారు.
