Monday, 16 March 2026
Swasthik News
Home / మార్కాపురం

పెద్దారవీడు మండలంలో "మీ భూమి - మీ హక్కు" కార్యక్రమం.

06 Feb 2026
01:09 PM
41

స్వస్తిక్ న్యూస్, యర్రగొండపాలెం :- పెద్దారవీడు మండలం, గొబ్బూరు గ్రామ సచివాలయం వద్ద ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా  ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొని ప్రజలకు ప్రభుత్వ రాజముద్ర కలిగిన పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. 

Article Image

 అనంతరం ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ..గత వైసీపీ పాలనలో రైతులకు ఇచ్చిన పాసు పుస్తకాలపై కూడా జగన్ మోహన్ రెడ్డి తన ఫోటో వేసుకుని, ప్రభుత్వ పథకాలను వ్యక్తిగత ప్రచారానికి వాడుకున్నారని విమర్శించారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రైతుల హక్కును గౌరవిస్తూ, ప్రభుత్వ రాజముద్రతో పాసు పుస్తకాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. 

Article Image

 ఈ కార్యక్రమంలో ఎరిక్షన్ బాబుతో పాటుగా మండల పార్టీ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు. 

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!