యర్రగొండపాలెం :- సభ్య సమాజం సిగ్గుపడేలా అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటని, 3 ఆడపిల్లల తండ్రిగా ఉండి, ఇలాంటి జుగుప్సాకర వ్యాఖ్యలు చేసినందుకు నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా ఛీ కొడతారు రాంబాబు అంటూ యర్రగొండపాలెం మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరి సుబ్బారావు తీవ్రంగా మండిపడ్డారు. అంబటి రాంబాబు ఒంట్లో ఉన్న కొవ్వు కరిగించడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు. అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్న సీఎం చంద్రబాబుని నోటికొచ్చినట్లు తిట్టడం సబబు కాదని అన్నారు. గొడవలు రాజేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించేందుకు జగన్ అండ్ కో కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి, లేకుంటే ప్రజలే తరిమి కొడతారని తీవ్రంగా ఖండించారు.