SPORTS NEWS:- అండర్-19 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించి తాజాగా ఒక విషయం సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. అండర్-19 కుర్రాళ్ళు వరల్డ్ కప్ గెలిచినా ఒక్క రూపాయి కూడా ఐసీసీ ఇవ్వలేదు అని వార్తలు వస్తున్నాయి. ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ను ఏకంగా 100 పరుగులు తేడాతో ఓడించిన కూడా ఈ భారత యువ జట్టుకు ప్రైజ్ మనీ ఇవ్వకపోవడం అభిమానులను సైతం షాకింగుకు గురి చేసింది.

అయితే దీనికి గల ఒక కారణమైతే ఐసీసీ స్పష్టం చేసింది. ఈ వరల్డ్ కప్ టోర్నీ అనేది కేవలం యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు మాత్రమే నిర్వహిస్తున్నాము అని.. అందుకే ఎటువంటి నగదు బహుమతులు ఇవ్వబడదు అని ఐసీసీ స్పష్టం చేసింది. కానీ ఫైనల్ మ్యాచ్ లో గెలిచి భారత్కు కప్ తెచ్చినటువంటి ఈ యువ క్రికెటర్లకు బీసీసీఐ మాత్రం 7.5 కోట్ల నజారానా ప్రకటించి వారి ముఖాల్లో సంతోషాన్ని నింపింది. ఐసీసీ ఒక్క రూపాయి ఇవ్వకపోయినా ప్లేయర్లను దృష్టిలో పెట్టుకొని.. ఎక్కడ కూడా వారిని నిరాశపరచకుండా బీసీసీఐ ఏడు కోట్లకు పైగా నజారానా ప్రకటించడం పట్ల ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
