స్వస్తిక్ న్యూస్, పుల్లలచెరువు :-పుల్లలచెరువు మండలంలో ఈ నెల 27, 28 తేదీలలో జరగనున్న 'డిజిటల్ మహానాడు' కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు, మహానాడును విజయవంతం చేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేశారు.ఇందులో భాగంగా, పుల్లలచెరువు మండలం క్లస్టర్-05 పరిధిలోని ముటుకుల గ్రామంలోని సిద్ధార్థ హైస్కూల్‌లో ఏర్పాటు చేస్తున్న మహానాడు వేదికలను యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు సోమవారం పరిశీలించారు.అనంతరం మండల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణ, వేదిక వద్ద కల్పించాల్సిన సౌకర్యాలు, నాయకులు-కార్యకర్తల మధ్య సమన్వయం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ, డిజిటల్ మహానాడును కనీవినీ ఎరుగని రీతిలో ఘనంగా నిర్వహించాలని, ఇందుకు ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక టీడీపీ నాయకులు నారాయణ రెడ్డి, సుబ్బారెడ్డి,కోటయ్య మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.