Monday, 16 March 2026
Swasthik News
Home / భక్తి వార్తలు

తిరుమల దేవస్థానం పేరిట నకిలీ వెబ్సైట్లు కలకలం..!

27 Feb 2026
08:52 AM
703

స్వస్తిల్ న్యూస్,ఆంధ్రప్రదేశ్ :-   ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా లేదా ఏ విషయంలోనైనా సరే నకిలీ అనే పదం వైరల్ అవుతుంది. నకిలీ వాటి వల్ల ఎంతో మంది ఎన్నో రకాలుగా మోసపోతున్న సందర్భాలు నిత్యం సోషల్ మీడియాలో ప్రతిరోజు కూడా చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయం కు సంబంధించిన వెబ్సైట్లు పేరిట కూడా కొంతమంది నకిలీవి సృష్టించి పెద్ద మొత్తంలో ప్రజలను మోసం చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ గుర్తించింది. తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో నకిలీ వెబ్సైట్లు సృష్టిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Article Image

 శ్రీవారి దర్శనం, సేవ టికెట్లు, వసతిగదులు ఇప్పిస్తాము అంటూ ఎంతో మందిని మోసం చేస్తున్న దళారులు నకిలీ వెబ్సైట్లపై తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుమల దేవస్థానంలోని చిత్రాలు, తిరుమల తిరుపతి దేవస్థాన పేరును ఉపయోగించి భక్తుల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా గుర్తించింది. వెంటనే వారిని గుర్తించి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఫేక్ వెబ్సైట్లపై కాపీరైట్ చట్టం కింద వెంటనే కేసులు నమోదు చేస్తాము అని పేర్కొంది. https://ttddevasthanams.gov.in ద్వారా మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానం కు సంబంధించిన సేవలు పొందాలి అని సూచించింది. 

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!