యర్రగొండపాలెం న్యూస్ :- వైయస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కెపిహెచ్బి టెంపుల్ బస్ స్టాప్ లో ప్లకార్డులు పట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రకాశం జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షులు దొండేటి నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మరియు ఐటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ తిరుమల లడ్డు కల్తీ అయిందని విష ప్రచారం చేసిన కూటమినేతలు సిబిఐ దర్యాప్తులో కల్తీ నెయ్యి అనేది కేవలం ప్రచారం మాత్రమేనని.. తిరుమల లడ్డులో కల్తీ లేదని నిగ్గు తేల్చడంతో చివరికి కూటమి సర్కార్ ఫ్లెక్సీల ప్రచారాన్ని తెరపైకి తీసుకువచ్చి డైవర్షన్ పాలిటిక్స్ కి తెర లేపారని ఆ ఫ్లెక్సీలను తీసే కార్యక్రమంలో ప్రభుత్వం తమదేవుందని ధైర్యంతో ఆటవికంగా అంబటి రాంబాబు ఇంటిపై దాడులు చేశారని ఎమ్మెల్యే తాటిపర్తిి ధ్వజం ఎత్తారు.

తిరుమల లడ్డు కల్తీ అయిందని దేవాలయం మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఏ దేవాలయం మెట్లు కడుగుతారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో కూటమి సర్కార్ కి బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ విభాగం ఉపాధ్యక్షులు మందపాటి హరీష్ రెడ్డి మరియు రాష్ట్ర ఐటీ విభాగం ఉపాధ్యక్షులు ఎద్దుల జనార్ధన్ రెడ్డి మరియు ప్రకాశం జిల్లా ఐటీ వింగ్ నాయకులు పాల్గొన్నారు.
