స్వస్తిక్ న్యూస్, మార్కాపురం:-జిల్లాలో శనివారం ఒక తీవ్ర విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ (PS) పరిధిలో అనుమానంతో ఒక భర్త తన భార్యను దారుణంగా హత్య చేశాడు.
ఘటన వివరాలు:- మార్కాపురం జిల్లా గిద్దలూరుకు చెందిన సురేష్ అనే వ్యక్తికి, 2015లో నగరంలోని రాంనగర్‌కు చెందిన జెస్సికాతో వివాహమైంది.కుటుంబం ఈ దంపతులకు ప్రస్తుతం 10 సంవత్సరాల వయసున్న ఒక కుమార్తె ఉంది.ఘతుకం భార్య జెస్సికా (35) ప్రవర్తనపై సురేష్ కొద్దిరోజులుగా అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే శనివారం ఆమెను అత్యంత దారుణంగా హతమార్చాడు.
హత్య అనంతరం భర్త ఫోన్:-భార్యను హత్య చేసిన అనంతరం సురేష్ నేరుగా జెస్సికా అక్కకు ఫోన్ చేశాడు. తానే స్వయంగా జెస్సికాను హత్య చేసినట్లు ఫోన్లో ఒప్పుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.