స్వస్తిక్ న్యూస్,ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాబోయే ఉగాది పండుగ సందర్భంగా సుమారు 60 విభాగాల్లో 10,000 ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా ప్రధానంగా విద్యాశాఖలో 3,000 కంటే ఎక్కువ టీచర్ (DSC) పోస్టులను, అలాగే గ్రూప్-1 విభాగంలో 101 మరియు గ్రూప్-2 విభాగంలో 470 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో 1,500 ఖాళీలను మరియు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా మరో 1,000 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ జాబ్ క్యాలెండర్‌పై పూర్తి స్థాయి స్పష్టత మరియు ఖాళీల ఖచ్చితమైన సంఖ్య మరో రెండు మూడు రోజుల్లో అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 వేల టీచర్ ఉద్యోగాలు అలాగే కానిస్టేబుల్స్ ఉద్యోగాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఉగాది కానుకగా దాదాపు 10 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చినట్లయితే నిరుద్యోగులకు ఇది పండుగ ఉత్సవాన్ని నింపినట్లు అవుతుంది.