పుల్లలచెరువు, యర్రగొండపాలెం:- యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పాలుట్ల గిరిజన గూడెంలో "రవి" కిరణాలు ప్రసరిస్తున్నాయి. ఆధునిక సాంకేతికత విస్తృతంగా నేడు అందుబాటులోకి వచ్చినా నేటికి ఆ గూడెంలో విద్యుత్ సౌకర్యం లేదు. రాత్రివేళల్లో చిమ్మ చీకట్లలోనే నివాసం ఉంటూ బ్రతుకు వెళ్ళదీస్తున్న పరిస్థితి. సరైన రహదారీ లేదు. అంతటి దీన గాధ వారిది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి రవి కుమార్ సమస్యను సీఎం దృష్టిలో తీసుకెళ్లి 611 కుటుంబాలకు 2.86 కోట్ల నిధులను మంజూరు చేయించి రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయించారు. దీంతో గూడెం వాసులు ఆ సోలార్ వెలుగులను 'రవి 'కిరణాలుగా చెప్పుకుంటున్నారు. నియోజకవర్గ ఇంచార్జి ఎరిక్షన్ బాబు చొరవతో తమ గూడెంలో రాత్రి పూట వెలుతురు చూస్తున్నామంటూ భావోద్వేగానికి గురవుతున్నారు.
