Wednesday, 17 June 2026
SWASTHIK NEWS
Home / మార్కాపురం

యర్రగొండపాలెంలో ఘనంగా 'ప్రజా దర్బార్'.. సమస్యల పరిష్కారానికి అధికారులకు గూడూరి ఎరిక్షన్ బాబు ఆదేశాలు

13 Jun 2026
02:44 PM
4,950

స్వస్తిక్ న్యూస్,యర్రగొండపాలెం :-   యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు  'ప్రజా దర్బార్' కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్  గూడూరి ఎరిక్షన్ బాబు  ముఖ్య అతిథిగా హాజరై, ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు తమ సమస్యలను వివరిస్తూ ఎరిక్షన్ బాబు గారికి అర్జీలు సమర్పించారు.

Article Image

ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, స్థానికంగా పరిష్కరించగలిగే సమస్యలపై తక్షణమే స్పందించారు. సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా మాట్లాడి, అక్కడికక్కడే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపించారు.మిగిలిన సమస్యలపై కూడా వెంటనే దృష్టి సారించాలని, ప్రజల వినతులను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఎరిక్షన్ బాబు గారు సూచించారు.

Article Image

ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని, ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం ఏఎంసి చైర్మన్ చేకూరి సుబ్బారావు, పుల్లలచెరువు మండల సీనియర్ నాయకులు శెనగ నారాయణ రెడ్డి,మండల టీడీపీ అధ్యక్షులు చిట్యాల వెంగల్ రెడ్డి, ఇతర కూటమి నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates