Wednesday, 17 June 2026
SWASTHIK NEWS
Home / మార్కాపురం

పుల్లలచెరువులో ఘనంగా టీడీపీ మండల స్థాయి సమావేశం.. తరలివచ్చిన ముఖ్య నేతలు!

10 Jun 2026
03:00 PM
1,626

స్వస్తిక్ న్యూస్,పుల్లలచెరువు :- స్థానిక మండల కేంద్రంలోని రైస్ మిల్లు ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణను చర్చించేందుకు నిర్వహించిన ఈ సమావేశానికి సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్‌చార్జీలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేశారు.

Article Image

అగ్రనాయకత్వం ఆధ్వర్యంలో సమరశంఖం... ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పుల్లలచెరువు మండల పార్టీ అధ్యక్షుడు పోట్ల గోవిందు, ఎంపీపీ కందులు వెంకటయ్య హాజరయ్యారు. వారితో పాటు మండల సీనియర్ నాయకులు కాకర్ల కోటయ్య, రెంటపల్లి సుబ్బారెడ్డి, పయ్యావుల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి శెనగ వెంకటేశ్వర్ రెడ్డి, మేడికొండ లక్ష్మణ్ తదితరులు వేదికను అలంకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ క్యాడర్‌కు దిశా నిర్దేశం చేశారు. టౌన్ పార్టీ అధ్యక్షుడు మేడికొండ అనిల్, ముటుకుల సొసైటీ చైర్మన్ పావులూరు యోగేశ్వరరావు, ఇడియమ్మ నాయుడు, ఉప్పల హనుమంతు, ద్వారకచర్ల అంజిరెడ్డి తదితరులు కూడా ఈ సమావేశంలో క్రియాశీలక పాత్ర పోషించారు.

Article Image

విజయవంతం చేసిన క్షేత్రస్థాయి శ్రేణులుస్థానిక ప్రజాప్రతినిధులు...  ఎంపీటీసీ రాధాకృష్ణ, ఎంపీటీసీ వెంగయ్యలతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు, బూత్ ఇన్‌చార్జీలు, యూనిట్ ఇన్‌చార్జీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ సమావేశం స్థానిక క్యాడర్‌లో సరికొత్త జోష్ నింపిందని నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.

Article Image

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates