Monday, 16 March 2026
Swasthik News
Home / క్రీడలు

IPL 2026కు హర్షిత్ రాణా దూరమా? KKR కు ఆందోళన

14 Mar 2026
09:29 AM
1,054

స్వస్తిక్ న్యూస్, క్రీడలు :- మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న IPL-2026 సీజన్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు పెద్ద దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. జట్టు ప్రధాన పేసర్ హర్షిత్ రాణా తొలి దశ మ్యాచ్‌లకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని సమాచారం. ఇటీవల వరల్డ్ కప్ లో  జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడినట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్‌కు ముందు నిర్వహించిన ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాణా గాయం కారణంగా కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి రావచ్చని వైద్యులు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో IPL ప్రారంభ మ్యాచ్‌లలో అతని సేవలు జట్టుకు అందకపోవచ్చు.

Article Image

గత సీజన్‌లో కోల్‌కతా జట్టు తరఫున రాణా అద్భుతంగా బౌలింగ్ చేసి 34 వికెట్లు సాధించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతని ప్రదర్శన జట్టుకు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో అతను ప్రారంభ మ్యాచ్‌లకు దూరమైతే కోల్‌కతా జట్టుకు అది పెద్ద లోటుగా మారే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే గాయం తీవ్రతపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. పరిస్థితిని పరిశీలించిన తర్వాత జట్టు మేనేజ్‌మెంట్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!