Monday, 16 March 2026
Swasthik News
Home / జాతీయ వార్తలు

నా కూతురికి మత్తు పదార్థాలు ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు..?

14 Mar 2026
11:16 AM
566

స్వస్తిక్ న్యూస్, జాతీయం :- మహా కుంభమేళాలో పూసల దండలు అమ్ముకుంటూ తన కళ్ళతో ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షింపజేసినటువంటి మోనాలిసా ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉంది. తాజాగా ఆమె పెళ్లి చేసుకోవడం.. ఆ విషయం తన తండ్రికి నచ్చకపోవడం అనేది కూడా ఈరోజు సోషల్ మీడియా వ్యాప్తంగా బాగా ట్రెండింగ్ నడుస్తోంది. అయితే మోనాలిసా పెళ్లి చేసుకోవడం పై తన తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగంలో అవకాశాల కోసం వెళ్లిన తన కుమార్తె మోనాలిసాను, ఒక యువకుడు మత్తుమందు ఇచ్చి మోసపూరితంగా వివాహం చేసుకున్నాడని ఆమె తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. ఓ మూవీ షూటింగ్ నిమిత్తం వెళ్లిన సమయంలో ఈ పరిచయం ఏర్పడిందని, ఆపై సదరు యువకుడు పక్కా పథకం ప్రకారం ఆమెకు మత్తు పదార్థాలు ఇచ్చి ఈ పెళ్లి చేసుకున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Article Image

 తన కుమార్తెతో కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఆ యువకుడు అడ్డుకుంటున్నాడని, అసలు ఆమె తన సొంత స్పృహలో ఉండి ఈ నిర్ణయం తీసుకోలేదని ఆయన కన్నీరు మున్నీరయ్యారు.ఈ విషయం తెలుసుకున్న తండ్రి తన కుమార్తెకు నచ్చజెప్పి ఇంటికి తీసుకువద్దామనే ఉద్దేశంతో కేరళకు వెళ్లగా, అక్కడ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. స్థానిక పోలీసులు తనకు సహకరించకపోగా, తనను బలవంతంగా అక్కడి నుంచి పంపించివేశారని ఆయన ఆరోపించారు. ఈ ఘటన కారణంగా సమాజంలో తమ కుటుంబ గౌరవం దెబ్బతిందని, బంధువుల నుండి వస్తున్న విమర్శలను తట్టుకోలేకపోతున్నానని ఆయన వాపోయారు. తన కుమార్తెను ఆ యువకుడి చెర నుండి కాపాడాలని, ఆమెకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపించాలని ఆయన కోరుతున్నారు. 

 

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!