స్వస్తిక్ న్యూస్, క్రీడలు :- ఐపీఎల్ ఈ సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు BCCI భారీ జరిమానా విధించింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రూ. 12 లక్షల ఫైన్ విధించినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఐపీఎల్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక జట్టు స్లో ఓవర్ రేట్ చేస్తే కెప్టెన్‌కు జరిమానా విధించే నిబంధన ఉంది. ఇదే నేపథ్యంలో పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై ఈ చర్యలు తీసుకున్నారు.ఇక పంజాబ్ జట్టు విషయానికి వస్తే, జట్టులో స్టార్ బౌలర్ జాన్షన్అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. తదుపరి మ్యాచ్‌లో లక్నౌ సూపర్ Giantsతో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.