Monday, 16 March 2026
Swasthik News
Home / తెలంగాణ

ఏపీ, తెలంగాణలో అకస్మాత్తుగా వర్షాలు.. దెబ్బతింటున్న పొలాలు?

15 Mar 2026
07:52 PM
4,064

స్వస్తిక్ న్యూస్, తెలంగాణ :- తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ మరోవైపు కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు పడటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ వర్షాల కారణంగా పొలాల్లో ఉన్న పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు ఈ వడగండ్ల వానలు నష్టం కలిగించడంతో రైతులకు ఆర్థికంగా పెద్ద దెబ్బ తగిలింది.

Article Image

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఆకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ అనూహ్యమైన వర్షాలు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఎండల మధ్యలోనే ఇలా వర్షాలు పడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రైతులు, ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Article Image

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!