స్వస్తిక్ న్యూస్, నేషనల్ :- ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్దా సోషల్ మీడియా ఫాలోయింగ్‌లో అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది. పార్లమెంటులో తన ప్రసంగాలతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆయనకు, ప్రస్తుతం సోషల్ మీడియాలో (SM) ఫాలోయింగ్ భారీగా పడిపోవడం చర్చనీయాంశంగా మారింది.
ముఖ్య అంశాలు:- భారీగా తగ్గిన ఫాలోవర్లు: గతంలో ఇన్‌స్టాగ్రామ్‌లో 14.6 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్న రాఘవ్ చద్దా ఫాలోయింగ్, ప్రస్తుతం 12.6 మిలియన్లకు పడిపోయింది.రికార్డు స్థాయి డ్రాప్ కేవలం రెండు రోజుల వ్యవధిలోనే దాదాపు 20 లక్షల (2 మిలియన్ల) మంది ఆయనను అన్‌ఫాలో చేయడం గమనార్హం. ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం లేదా రాజకీయ నిర్ణయాల నేపథ్యంలో ఈ 'క్రాష్' జరిగి ఉండవచ్చని సమాచారం. ముఖ్యంగా ఆయన బీజేపీలో చేరుతున్నారనే వార్తలు రాకముందే ఈ స్థాయిలో ఫాలోవర్లు తగ్గడం గమనార్హం.గతంలో కూడా దేశంలోని పలువురు సెలబ్రిటీలకు ఫాలోవర్లు తగ్గిన సందర్భాలు ఉన్నప్పటికీ, ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో ఫాలోయింగ్ పడిపోవడం ఇదే మొదటిసారి అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం సోషల్ మీడియా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.