స్వస్తిక్ న్యూస్, టెక్నాలజీ :- ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) అమ్మకాలను మరింత వేగవంతం చేసే దిశగా ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. జులై నెలకు సంబంధించి తమ ఈవీ కార్లపై కస్టమర్లను ఆకర్షించేందుకు భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. మోడల్‌ను బట్టి లక్షల రూపాయల మేర ప్రయోజనాలను అందిస్తోంది.

వివిధ మోడళ్లపై డిస్కౌంట్ల వివరాలు ఇలా ఉన్నాయి :-
Curvv (కర్వ్): - ఈ మోడల్‌పై గరిష్టంగా రూ. 3.35 లక్షల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
Harrier (హారియర్):- ఈ ఎస్‌యూవీపై రూ. 2.75 లక్షల మేర ప్రయోజనాలు పొందవచ్చు.
Punch (పంచ్), Tiago (టియాగో):- ఈ రెండు పాపులర్ మోడళ్లపై రూ. 1.45 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
Nexon (నెక్సాన్):- బెస్ట్ సెల్లింగ్ ఈవీ అయిన నెక్సాన్‌పై రూ. 50 వేల వరకు తగ్గింపు ఇస్తున్నారు.

ఈ డిస్కౌంట్లలో వివిధ రకాల ప్రయోజనాలు కలిసి ఉన్నాయి. క్యాష్ బెనిఫిట్స్ (నగదు తగ్గింపు), పాత వాహనాన్ని మార్చుకుంటే లభించే ఎక్స్‌ఛేంజ్ బోనస్, అలాగే స్క్రాపేజ్ బోనస్ వంటివి ఈ ఆఫర్లలో భాగం.మరోవైపు, టాటా మోటార్స్ ఈవీ విభాగంలో దూసుకుపోతోంది. సఫారీ, ఆల్ట్రోజ్ మోడళ్లను మినహాయిస్తే, తమ లైనప్‌లోని దాదాపు అన్ని ఇతర మోడళ్లను ఇప్పటికే ఎలక్ట్రిక్ వెర్షన్లలోకి తీసుకురావడం విశేషం.