Monday, 16 March 2026
Swasthik News
Home / ఆంధ్రప్రదేశ్

కాకినాడలో భారీ పేలుడు.. పొలాల్లో పడ్డ మృతదేహాల శరీర భాగాలు

28 Feb 2026
04:50 PM
5,219

స్వస్తిక్ న్యూస్, ఆంధ్ర ప్రదేశ్ :-  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా వేట్లపాలెం పొలాల ప్రాంతంలో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 21 మంది మృతి చెందగా అందులో 13 మృతదేహాలను పోలీసులు గుర్తించి బయటకు తీశారు. వేట్లపాలెం సమీప ప్రాంతంలో లోని పొలాలలో బాణాసంచా తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించి మాటలు చెలరేగిన దృశ్యాలు ప్రతి ఒక్కరిని కూడా భయానికి గురిచేస్తున్నాయి. పొలాల మధ్య ఆరు షెడ్లు వేసి బానిసంచ తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో చాలామంది కూడా భోజనం చేయడానికి బయటకు వెళ్లడంతో పలువురు ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 

Article Image

భారీ పేలుడు సంభవించడంతో  అందులో చిక్కుకున్నటువంటి చాలామంది వ్యక్తుల శరీర భాగాలు పొలాల్లో పడినట్లుగా స్థానికులు భయంతో సమాచారం అందజేస్తున్నారు. ఇక ఇప్పటికే అక్కడికి అధికారులు మరియు అంబులెన్సులు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఈ ఘటనపై ఆరా తీస్తూ హోంమంత్రి అనితను అక్కడికి వెళ్ళమని కోరారు. ఈ భారీ పేలుడు దాదాపు 7 కిలోమీటర్ల మేర వినిపించింది అంటూ స్థానికులు చెబుతున్నారు.  ఇప్పటికే ఈ ఘటనలో 21 మంది చనిపోగా ఈ ఘటనకు సంబంధించి  మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Article Image

Article Image

 

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!