స్వస్తిక్ న్యూస్, నేషనల్:-ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. 2026 ఆర్థిక సంవత్సరంలో (FY26) ఈ సంస్థకు భారీగా నష్టాలు వాటిల్లినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.
వార్తలోని ముఖ్యాంశాలు:- భారీ నష్టం FY26లో ఎయిర్ ఇండియాకు సుమారు $2.4 బిలియన్ల (సుమారు రూ. 22 వేల కోట్లు) నష్టం వాటిల్లింది. జనవరిలో బ్లూమ్‌బెర్గ్ అంచనా వేసిన $1.6 బిలియన్ల నష్టం కంటే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం.సహాయం కోరిన టాటా గ్రూప్ సంస్థ నష్టాల నుంచి గట్టెక్కేందుకు, వాటాదారులైన టాటా గ్రూప్.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ సహాయాన్ని కోరినట్లు సమాచారం.నష్టాలకు ప్రధాన కారణాలుఅహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రభావం.భారత విమానయాన సంస్థలకు పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేయడం.పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం వల్ల విమాన సర్వీసులపై పడ్డ ప్రభావం.
అంతర్జాతీయ పరిణామాలు మరియు సాంకేతిక కారణాల వల్ల ఎయిర్ ఇండియా ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల నుంచి సంస్థను గట్టెక్కించేందుకు యాజమాన్యం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.