Monday, 16 March 2026
Swasthik News
Home / మార్కాపురం

సీఎం స్పీచ్ తో మార్కాపురంలో దద్దరిల్లిన సభ..!

25 Feb 2026
05:21 PM
3,501

స్వస్తిక్ న్యూస్,మార్కాపురం:-  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నూతన మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్ట్ ను సందర్శించి అనంతరం మార్కాపురం పట్టణం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. చంద్రబాబు స్పీచ్ ప్రారంభించగానే సభలో ఉన్నటువంటి నాయకులు మరియు కార్యకర్తలతో పాటు ప్రతి ఒక్కరు కూడా కేరింతలతో సభకు మరింత జోష్ నింపారు. 

Article Image

ఈ సభలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీని ఒక ఆట ఆడుకున్నారు. గత ఐదేళ్ల ప్రభుత్వంలో వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసాము అని వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలోని ప్రతి  ఒక్కరిని నట్టేట ముంచేశారు అని తీవ్రంగా మండిపడ్డారు. గడిచిన 5 ఏళ్లలో నేరాలు ఘోరాలు బూతులు మాట్లాడడం తప్పించి మీరు ఏం చేశారు అని ప్రశ్నించారు. అలాగే నూతన మార్కాపురం జిల్లాలోని ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి నియోజకవర్గం అభివృద్ధి చేసే దమ్ము నాకు ఉంది. మళ్లీ ఓట్లు వేసి గెలిపించే దమ్ము మీకుందా అని సవాలు విసిరారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చి చేయకుండా వదిలేసినట్లు ఈ చంద్రన్న చేయడు అని అన్నారు.

Article Image

ఒకసారి మాట ఇచ్చానంటే ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఎంతకైనా తెగిస్తాను, ఎంతవరకైనా వెళ్తాను అని అన్నారు. 2026 జూన్ నాటికల్లా వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తిచేసి మళ్ళీ మీ ముందుకు వస్తాను అని నూతన జిల్లా మార్కాపురం ప్రజలకు హామీ ఇచ్చారు. ఇక ఇదే భారీ బహిరంగ సభలో భాగంగా రాబోయే రోజుల్లో ఈ జిల్లాను ఉద్యానవనంగా మార్చే బాధ్యత నాది అని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా జిల్లా మొత్తానికి తాగునీరు మరియు సాగునీరు అందించే బాధ్యత నాది అని తెలిపారు. ఇక ఆ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి జోలికి వెళితే ఎవరైనా సరే పుట్టగతులు లేకుండా పోతారు అని తెలియజేశారు.

Article Image

 మీరందరూ  కోరిన విధంగానే మార్కాపురం పట్టణాన్ని జిల్లాగా చేస్తాను అని హామీ ఇచ్చి ఈరోజు ఆ హామీని నెరవేర్చాను అని స్పష్టం చేశారు. ఇక రాబోయే జూన్ నాటికి వెలుగొండ ప్రాజెక్టును ఇచ్చిన హామీ ప్రకారం పూర్తి చేసి ప్రతి ఎకరానికి నీరు ఇస్తాను అని తెలియజేశారు. ఇక ఫ్లోరైడ్ సమస్య లేకుండా చేస్తాను అని కూడా ఈ సభ ముఖంగా తెలియజేశారు. ఇక చివరిలో ప్రతి ఇంటికి కూడా భవిష్యత్తులో ఇంటింటికి కుళాయిల ద్వారా సాగునీరు అందిస్తామని తెలియజేశారు. నూతన జిల్లా మార్కాపురం అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దమ్ము నాకు ఉంది అని.. మళ్లీ నూరుకి నూరు శాతం కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి బాధ్యత మీరు తీసుకోవాలని తెలిపారు. రైతులకు, మహిళలకు, పిల్లల భవిష్యత్తుకు, గ్రామం అభివృద్ధికి, మండల అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధికి, జిల్లా అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి మాత్రమే కాకుండా దేశ అభివృద్ధి కూడా సర్వశక్తుల నేను ఉన్నంతకాలం కష్టపడుతూనే ఉంటాను అని అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో భారీ బహిరంగ సభ కేరింతలతో దద్దరిల్లింది. 

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!