స్వస్తిక్ న్యూస్,ఆంధ్ర ప్రదేశ్ :- కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేస్తోందని హోంమంత్రి అనిత ప్రకటించారు. ఎవరైనా ఆడపిల్లల జోలికొస్తే అదే వారికి చివరి రోజు అనే సందేశం ప్రజల్లోకి పంపామని గుర్తు చేశారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో నేరాలు పెరిగాయన్న వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపణలను.. శాసనమండలిలో మంత్రి అనిత తిప్పికొట్టారు. మహిళల పర్యవేక్షణలో నిరంతరం పోలీసులు అహర్నిశలు కష్టపడుతూనే ఉంటారు అని వ్యాఖ్యానించారు.