ఆంధ్రప్రదేశ్ రాజకీయం:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీ, నాయకులను ఉద్దేశించి కీలక ఆరోపణలు చేశారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై తాజాగా కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీ నేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన లడ్డు కల్తీ విషయంపై ప్రతి ఒక్కరు కూడా చర్చిస్తూ ఉన్నారు.

ఇదే సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో హిందుత్వంపై అనేక దాడులు జరిగాయని గుర్తు చేశారు. వైసీపీ పార్టీ పూర్తిగా భగవంతుడిపై పగబట్టారు అని ఆరోపించారు. 59.70 లక్షల కిలోల కల్తీ పామాయిల్ తో కొన్ని కోట్ల లడ్లు తయారు చేశారు అని.. వీటిలో కొన్ని అయోధ్య కూడా పంపించారు అని అన్నారు. వీళ్లు చెప్పినటువంటి కల్తీ నెయ్యికి సంబంధించి ఆన్ రికార్డ్ సాక్షాలు కూడా దొరికాయి అని స్పష్టం చేశారు. భగవంతుడిపై ఎవరైనా సరే పగబడితే వాళ్ళు సర్వనాశనం అయిపోతారు అని.. దేవుడితో ఆటలు ఆడ వద్దని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఏపీలో ఈ తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం పై తీవ్రస్థాయిలో చర్చలు నడుస్తున్నాయి. ఈ సమావేశంలో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు సైతం లడ్డు కల్తీ విషయంపై వైసీపీ పార్టీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
