స్వస్తిక్ న్యూస్,తెలంగాణ:- రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. 1 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించే సమ్మేటివ్ అసెస్‌మెంట్ (SA-2) పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు ఏప్రిల్ 10వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, అదే సమయంలో ఓపెన్ స్కూల్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో, విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. తాజా మార్పుల ప్రకారం, ఏప్రిల్ 10కి బదులుగా రెండు రోజులు ముందుగానే, అంటే ఏప్రిల్ 8వ తేదీ నుంచే విద్యార్థులకు SA-2 పరీక్షలు నిర్వహించనున్నారు.
తరగతుల వారీగా పరీక్షల సమయాలు ఇలా ఉన్నాయి...
- 1 నుంచి 7వ తరగతుల విద్యార్థులకు:- ఉదయం 9:00 గంటల నుంచి 11:30 గంటల వరకు.
- 8వ తరగతి విద్యార్థులకు:- ఉదయం 9:00 గంటల నుంచి 11:45 గంటల వరకు.
- 9వ తరగతి విద్యార్థులకు:- ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.
- పేరెంట్స్ మీటింగ్ మరియు సెలవులు:- పరీక్షలు అన్నీ పూర్తయిన తర్వాత ఏప్రిల్ 23వ తేదీన అన్ని పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ (తల్లిదండ్రుల సమావేశం) నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. ఆ మరుసటి రోజు అనగా, ఏప్రిల్ 24 నుంచి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.