స్వస్తిక్ న్యూస్, నేషనల్:- ఉమెన్ రిజర్వేషన్ బిల్లుపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ బిల్లుపై ఆయన స్పందిస్తూ, ఇది నిజమైన "మహిళా బిల్లు" కాదని ఆరోపించారు.
ముఖ్య అంశాలు:- లక్ష్యంపై విమర్శలు మహిళలను అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఎలక్టోరల్ మ్యాప్ (నియోజకవర్గాల పునర్విభజన) మార్చేందుకు ప్లాన్ చేస్తోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.పాత బిల్లుకే మొగ్గు గతంలో (2023లో) పాస్ చేసిన బిల్లే సరైనదని, ఆ పాత బిల్లును యథాతథంగా తీసుకువస్తే ఎటువంటి అభ్యంతరం లేకుండా ఆమోదించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.OBCల ప్రయోజనాలు ఈ బిల్లు ద్వారా OBC (ఇతర వెనుకబడిన తరగతుల) ప్రాతినిధ్యాన్ని తగ్గించి, వారి నుంచి అధికారాన్ని లాక్కోవాలని కేంద్రం చూస్తోందని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వ వ్యూహాలను తప్పుబడుతూ, మహిళల సాధికారత కంటే రాజకీయ ప్రయోజనాలే కేంద్రానికి ముఖ్యమని రాహుల్ గాంధీ విమర్శించారు.