స్వస్తిక్ న్యూస్, స్పోర్ట్స్ :- T20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ది గ్రేటెస్ట్ రైవల్రీ అంటూ చాలామంది ఈ మ్యాచ్పై ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా చూడడం మామూలే. కానీ పాకిస్తాన్ జట్టును ఒక ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా వంటి జట్లతో పోల్చడమే ప్రతి ఒక్కరికి కూడా కోపం వస్తుంది.

ఇరుజట్ల మధ్య 15 మ్యాచులు జరిగి అందులో చెరి సగం గెలిస్తేనే రైవల్రీ అంటారు. కానీ ఇక్కడ ఇరుజట్ల మధ్య అసలు పోటీనే లేదు. ఈ విషయాన్ని స్వయంగా టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మీడియాతో ప్రస్తావించారు. కానీ ఇరుదేశాల మధ్య వైరాలు ఉండడంతో ప్రేక్షకులకు సైతం ఈ మ్యాచ్ ఎంతో ఆనందాన్ని ఇచ్చినప్పటికీ చాలామంది భారత్ తో.. పాకిస్తాన్ జట్టును పోలుస్తున్నారు. పాకిస్తాన్ జట్టు చాలా బలమైనది.. ఇండియా పై గెలుస్తామంటూ ఎన్నో సందర్భాల్లో పాకిస్తానీలు అంటున్నారు. కానీ మన భారత క్రికెట్ అభిమానులు మాత్రం పాకిస్తాన్ క్రికెట్ జట్టును లెక్కలో కూడా వేసుకోరు.

ఇకనైనా టీం ఇండియా జట్టుతో పాకిస్తాన్ ను పోల్చకండి అంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ కామెంట్లు చేసే వాళ్లు కూడా రైవల్రీ అని అనకండి అంటూ సూచనలు చేస్తున్నారు. ప్రతి మ్యాచ్ లోను టీమిండియానే గెలుస్తుంటే ఇక ప్రత్యర్థి జట్టు బలమైన జట్టు ఎలా అవుతుంది అంటూ.. దయచేసి ఇరుజట్ల మధ్య పోలిక అనే పదాన్ని మాత్రం ఉపయోగించకండి అంటూ చాలామంది కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఎన్నో వింతలు మార్పులు చోటు చేసుకున్న తర్వాత ఐసీసీ రంగంలో దిగడంతో ఎట్టకేలకు భారత్ మరియు పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ను చిత్తుచిత్తుగా టీమిండియా ఓడించడం కూడా జరిగింది.
