స్వస్తిక్ న్యూస్, సినిమా :- గ్లోబల్ స్టార్ Ram Charan హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీ మొత్తం రన్‌టైమ్ దాదాపు 3 గంటల 20 నిమిషాలు ఉండనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే, ఈ చిత్ర ట్రైలర్‌ను ఈ నెల 17న విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, ఇప్పటికే ట్రైలర్ పనులు పూర్తయ్యాయని తెలుస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ కథనం, విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోనుందని అభిమానులు భావిస్తున్నారు.ఇప్పటికే టాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి, యానిమల్, కల్కి, పుష్ప-2, RRR వంటి చిత్రాలు భారీ రన్‌టైమ్‌తో విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. అదే తరహాలో ‘పెద్ది’ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందా అనే ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది.