Wednesday, 03 June 2026
SWASTHIK NEWS
Home / జాతీయ వార్తలు

బస్సు ప్రమాదంలో చిక్కుకున్నారా..? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

06 Apr 2026
03:14 PM
584

స్వస్తిక్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ :-  ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ప్రైవేట్ బస్సు ప్రమాదాలు, వాటిలో జరుగుతున్న ప్రాణనష్టం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రయాణికులలో అవగాహన కల్పించేందుకు ఒక రవాణా శాఖ అధికారి చేసిన సూచనలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాద సమయంలో ప్రాణనష్టాన్ని తగ్గించడానికి ప్రయాణికులు పాటించాల్సిన ముఖ్యమైన అంశాలను ఆయన వివరించారు.

Article Image

ఎమర్జెన్సీ ఎగ్జిట్ గుర్తింపు :- బస్సు ఎక్కిన వెంటనే అత్యవసర ద్వారం (Emergency Exit) ఎక్కడ ఉందో ముందుగానే గమనించాలి. ప్రమాదం జరిగినప్పుడు సామాగ్రి లేదా బ్యాగుల కోసం వెతకడం మానుకోవాలి. సమయాన్ని వృథా చేయకుండా ప్రాణాలను రక్షించుకోవడమే ప్రాధాన్యతగా పెట్టుకోవాలి. ప్రమాద సమయంలో కంగారు పడకుండా, ఒకరి తర్వాత ఒకరు క్రమశిక్షణతో ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటకు రావాలి. సురక్షితంగా బయటపడటమే అన్నిటికంటే ముఖ్యమని, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. నిరంతరం పెరుగుతున్న రహదారి ప్రమాదాల దృష్ట్యా, ప్రయాణికులు ఇటువంటి భద్రతా నియమాలను పాటించడం ద్వారా తమ ప్రాణాలను కాపాడుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. 

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates