CINEMA UPDATES :- నందమూరి హీరోలు అంటేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ఉంది. నందమూరి హీరోలుగా మంచి గుర్తింపుతో పాటు లక్షలాదిమంది ఫాన్స్ ను కూడా సంపాదించుకున్నారు. నందమూరి తారక రామారావు నుంచి మొదలు పెట్టుకుంటే హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ ప్రతి ఒక్కరూ కూడా మెప్పించి అలరించారు. కానీ ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సినిమా కెరీర్ చాలా దారుణంగా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి ఇప్పటివరకు తీసిన సినిమాలలో హిట్ల కంటే ఫ్లాప్లే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ 25 సినిమాలు తీయగా అందులో కేవలం 5 సినిమాలు మాత్రమే మంచి సక్సెస్ అయ్యాయి. పటాస్, 118, బింభిసారా, అతనొక్కడే, హరి రామ్ వంటి సినిమాలు మాత్రమే విజయాలు సాధించాయి. ఇక మిగతా 20 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడ్డాయి. ఇవన్నీ చూస్తుంటే ఒకరకంగా హీరోగా అతని కెరీర్ దారుణంగా ఉంది అని అర్థమవుతుంది. కళ్యాణ్ రామ్ చివరిగా నటించినటువంటి "అర్జున్ సన్నాఫ్ వైజయంతి" అనే సినిమా భారీ అంచనాలతో వచ్చిన కూడా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో కూడా అసలు క్లారిటీ లేదు. అసలు కళ్యాణ్ రామ్ సినిమాలు చేస్తాడా?.. లేదా?.. అనే విషయం పై కూడా స్పష్టత లేదు.

.