Wednesday, 03 June 2026
SWASTHIK NEWS
Home / రాజకీయం

తెలంగాణ మీ అయ్య జాగీరా? అంటూ.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

02 Jun 2026
04:54 PM
7,265

స్వస్తిక్ న్యూస్, పాలిటిక్స్ :-  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను బెదిరించేవారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ అద్భుతంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని, తనకు మరో ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు."నాకు హైదరాబాద్ లో ఏం పని అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మీరెవరయ్యా నన్ను బెదిరించడానికి? తెలంగాణ మీ అయ్య జాగీరా?" అని పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.తనపై దాడులు చేస్తారా అంటూ సవాల్ విసిరిన ఆయన, "తెలంగాణ కంటే ఆంధ్రలోనే నాకు బెదిరింపులు ఎక్కువ. దాడి చేయాలనుకుంటే నా ఇంటి అడ్రస్ తెలిసేందుకే ఇంటివద్ద ప్రెస్ మీట్ పెట్టాను," అని ధీమా వ్యక్తం చేశారు."తెలంగాణ నా గుండెల్లో ఉంది" అని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates