Monday, 16 March 2026
Swasthik News
Home / క్రీడలు

10వ తరగతి పరీక్షల్లో తన సత్తా ఏంటో చూపించబోతున్న వైభవ్?

14 Feb 2026
01:48 PM
163

స్వస్తిక్ న్యూస్, స్పోర్ట్స్ :- 14 ఏళ్ల వయసులోనే తన అద్భుతమైన ఆటతీరుతో క్రికెట్లో సంచలనం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మారు మోగిపోతుంది. కేవలం 15 సంవత్సరాలకే అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి క్రికెట్ ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు క్రికెట్లో తన సత్తా చూపించిన వైభవ్ ఇప్పుడు టెన్త్ పరీక్షలలో తన సత్తా ఏంటో నిరూపించుకునే సమయం ఆసన్నమైంది.

Article Image

అవును మీరు విన్నది నిజమే.. అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా కీలక పాత్ర పోషించిన వైభవ్ సూర్యవంశీ మరో మూడు రోజులలో టెన్త్ పరీక్షలు రాయనున్నారు. ఈనెల 17వ తేదీ నుంచి జరిగేటువంటి CBSE పదో తరగతి ఎగ్జామ్స్ రాయనున్నారు అని తెలిపారు. ఫోడార్ ఇంటర్నేషనల్ స్కూల్ లో వైభవ్ సూర్యవంశి ఈ పదవ తరగతి ఎగ్జామ్స్ రాయనున్నారు అని.. ఇప్పటికే అతనికి అడ్మిట్ కార్డు అందజేసినట్లుగా ప్రిన్సిపాల్ నిల్ కిషోర్ తెలిపారు. ఇక పరీక్ష హాలులో ఇతర విద్యార్థుల మాదిరిగానే వైభవ్ కూడా సాధారణ విద్యార్థిగా చూస్తాము అని స్కూల్ యాజమాన్యం తెలిపింది. దీంతో అతడి వయసు నిజంగానే 15 సంవత్సరాలు అని ఈ విషయంపై క్లారిటీ అయితే వస్తుంది.

Article Image

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!