స్వస్తిక్ న్యూస్, జాతీయం :- మన భారతదేశంలో సెలబ్రిటీలకు మామూలు క్రేజ్ ఉండదు. సెలబ్రిటీలు రేపో లేదా ఎల్లుండో ఒక కాలనీకి గానీ,షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి గానీ వస్తారు అని తెలియగానే ముందు రోజు నుంచే భారీ కటౌట్ట్లు ఏర్పాటు చేస్తూ ఎలాగైనా సరే ఆ సెలబ్రిటీ ని కలిసే విధంగా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక అసలు మేటర్ లోకి వస్తే.. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలకు బ్రేకప్ అవుతున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. టాలీవుడ్, బాలీవుడ్ అలాగే హాలీవుడ్ వంటి సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా క్రీడారంగంలోనూ ఎంతో మంది సెలబ్రిటీలు బ్రేకప్ అవుతున్నాయి. అయితే వీరు బ్రేకప్ తర్వాత ఏమవుతున్నారు.. ఏం చేస్తున్నారు అనేది చాలామందికి ఒక ప్రశ్నగా మారిపోయింది.

సాధారణంగా సాధారణ వ్యక్తులు బ్రేకప్ తర్వాత అబ్బాయి, అమ్మాయి ఇద్దరు కూడా ఏడవడం, ఒకరిని ఒకరు తలుచుకొని బాధపడుతూ కెరియర్ పై ఫోకస్ చేయకుండా గడ్డాలు పెంచేసుకుంటూ.. లో లోపల ఏడుస్తూ కాలాన్ని గడుపుతారు. కానీ సినిమా సెలబ్రిటీలు మాత్రం దానికి పూర్తిగా వ్యతిరేకం. చాలామంది సెలబ్రిటీలు రిలేషన్ లో ఉన్న తర్వాత బ్రేకప్ అయితే వెంటనే వారు 100% కెరియర్ పై ఫోకస్ చేస్తున్నారు. కావలసినంత డబ్బు అలాగే పేరు ఉంది కాబట్టి వారికి ఎవరైనా సరే పడిపోతారు అనే ఆలోచనతో ముందుకు సాగుతూ కెరియర్ పై ఫోకస్ చేస్తారు.

- నిహారిక కొనిదెలా
- సమంత
- తమన్నా
- స్మృయితీ మందనా
- చాహల్
- ధనుష్
- హార్దిక పాండ్య
- AR రెహమాన్
- షమ్మీ
పైన పేర్కొన్న ప్రతి ఒక్కరూ కూడా బ్రేకప్ అయినా తరువాత కెరియర్ పై ఫోకస్ చేస్తున్నారు. ఇలాంటివారిని ప్రస్తుత రోజుల్లో చాలా మందిని చూస్తున్నాం. తమన్నాతో బ్రేకప్ అయిన తర్వాత విజయ్ వర్మ నటనపై ఫోకస్ చేస్తున్నారు. ఇటీవల ఉమెన్ క్రికెటర్ స్మృతి మందనా సైతం బ్రేకప్ తర్వాత తన కెరియర్ పై ఫోకస్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే తన లవర్ ఆదిత్య రాయి కపూర్ కూడా ఇప్పుడు కెరియర్ పై ఫోకస్ చేస్తున్నారు. ఇలా ప్రతి ఒక్క సెలబ్రిటీ అందరూ కూడా కెరియర్ పై ఫోకస్ చేస్తున్నారు.