Monday, 16 March 2026
Swasthik News
Home / రాజకీయం

"యువగళం" నేటికి 3 ఏళ్ళు.. సరికొత్త కథనం మీకోసం

27 Jan 2026
05:17 PM
1,601

⇒మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువగళం పాదయాత్ర

⇒ మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రతో ముఖ్య పాత్ర పోషించిన లోకేష్ యువగళం 

POLITICS:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, యువ నాయకుడు మంత్రి నారా లోకేష్  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాలు కూడా అతని నాయకత్వం గురించి మాట్లాడే స్థాయికి చేరారు. ఒకప్పుడు ప్రతిపక్ష పార్టీలు పప్పుగా ముద్రను వేయగా ఇప్పుడు ఆ మనిషే ప్రతిపక్ష పార్టీల గుండెల్లో వణుకు పుట్టించేలా తయారయ్యారు.

Article Image

 నార లోకేష్ 2023లో మొట్టమొదటిసారిగా "యువగళం" పాదయాత్రను ప్రారంభించారు. 2023 జనవరి 27న కుప్పంలోని శ్రీ వరదరాజ స్వామి ఆలయం వద్ద ప్రారంభమైనటువంటి ఈ యాత్ర దాదాపు 226 రోజులపాటు 3132 కిలోమీటర్ల వరకు సాగింది. నేటికీ సరిగ్గా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.

Article Image

 ఈ సందర్భంగా నారా లోకేష్ ఆ రోజుల్లో జరిగినటువంటి ఈ అద్భుతమైన దృశ్యాలను నెమరు వేసుకుంటూ ట్వీట్ చేశారు. తన పాదయాత్రలో రైతులు, మహిళలు,యువత, కార్మికులతో సహా అన్ని వర్గాల సమస్యలను ప్రత్యక్షంగానూ తెలుసుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే దానికి కారణం 60% నారా లోకేష్ యువగళం పాదయాత్రే. ఈరోజు ప్రజల ఆశలు అలాగే ఆకాంక్షలకు అనుగుణంగానే తమ విధివిధానాలు ఉంటాయని నారా లోకేష్ స్పష్టం చేశారు.

Article Image

 ఆ యువగళం పాదయాత్రలోనే అందరి సమస్యలను తెలుసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటికీ కూడా పరిష్కారం చూపుతాము అని హామీ ఇచ్చారు. అన్నట్టుగానే అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగాలు ఇచ్చారు. ప్రజలకు సంక్షేమాలను అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేయడానికి.. నిరంతరం పెట్టుబడులు తీసుకురావడానికి పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించి అహర్నిషలు కష్టపడుతున్నారు.  యువగళం పాదయాత్ర తోనే ఇదంతా సాధ్యమైంది అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు సైతం ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నారు. 

Article Image

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!