Monday, 16 March 2026
Swasthik News
Home / సినిమా

రాముడి పాత్రలో ఒదిగిపోవాలి అంటే చాలా కష్టం : మహేష్ బాబు

05 Feb 2026
07:30 AM
66

CINEMA UPDATES:-  దర్శక ధీరుడు రాజమౌళి, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్నటువంటి భారీ బడ్జెట్ మూవీ వారణాసి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా సన్నివేశాలను చిత్రీకరించగా ఇంకా సగభాగం చిత్రీకరించాల్సి ఉంది. ఇక రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకునేటువంటి ఈ వారణాసి సినిమాలో మహేష్ బాబు దేవుడు పాత్రలలో కనిపించనున్నారు. ముఖ్యంగా రాముడి పాత్రలో నటిస్తున్నారన్న విషయం ఇప్పటికే ప్రతి ఒక్కరికి తెలుసు.

Article Image

 అయితే తాజాగా వెరైటీకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో భాగంగా మహేష్ బాబు ఈ వారణాసి మూవీలోని తన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు మాట్లాడుతూ.. వారణాసి ఈ సినిమాలో రాముడి పాత్ర చేయడం బిగ్గెస్ట్ చాలెంజ్ అని.. దేవుడి పాత్రలో ఒదిగిపోవాలి అంటే దానికి తగ్గట్టుగా శిక్షణ అవసరమని అన్నారు. గత మూడు నెలల నుంచి కలరియపట్టు లో శిక్షణ తీసుకుంటున్నట్లు.. ఈ శిక్షణలో భాగంగా దేవుడు నిలబడే తీరు, నడిచే నడక, మాట్లాడే విధానాన్ని నేర్చుకున్నాను అని అన్నారు.

Article Image

ఇక మిగతా సినిమాల్లో లాగా మోడరన్ మరియు రన్నింగ్ స్టైల్ అనేది పూర్తిగా చేంజ్ చేసుకున్నాను అని.. ఇందుకోసం చాలానే ప్రాక్టీస్ చేశాను అని తెలిపారు. ఇప్పటికే రాజమౌళి ఈ సినిమాను కలల ప్రాజెక్టుగా చెబుతున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు సైతం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాదిలో కచ్చితంగా రిలీజ్ చేస్తామని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. 

Article Image

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!