SPORTS NEWS :- భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య జరుగుతున్నటువంటి T20 సిరీస్ లో భాగంగా అభిషేక్ శర్మ విరుచుకుపడుతున్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. నిన్న రాత్రి 7 గంటలకు జరిగినటువంటి మూడవ టి20 మ్యాచ్ లోను అభిషేక్ శర్మ కేవలం 14 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసి రికార్డు సృష్టించారు. సిక్సర్ల వీరుడుగా అభిషేక్ శర్మ గుర్తింపు పొందడానికి ముఖ్య కారణం యువరాజ్ సింగ్. ఎందుకంటే ఈ సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ ట్రైనింగ్ లోనే పూర్తిస్థాయిలో బ్యాటింగ్ నేర్చుకున్నారు.

అయితే నిన్న మ్యాచ్ అయిపోయిన అనంతరం యువరాజ్ సింగ్ తన సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలోని ఇండియన్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరిని కూడా ఆనందానికి గురిచేస్తుంది. యువరాజ్ సింగ్ తన సోషల్ మీడియా వేదికగా అభిషేక్ శర్మ ఆఫ్ సెంచరీ పట్ల " ఇప్పటికీ 12 బంతుల్లో 50 చేయలేకపోయావు.. సరేలే బాగా ఆడావు" అని ట్వీట్ చేశారు. దీంతో యువరాజ్ సింగ్ తన శిష్యుడికి సరదాగా ట్వీట్ చేశారు అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ ట్వీట్ ను వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. అంతర్జాతీయ భారత జట్టు తరుపున అతి తక్కువ 12 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేసిన రికార్డు ప్రస్తుతం యువరాజ్ సింగ్ పేరిటనే ఉంది. అయితే త్వరలోనే ఈ రికార్డును అభిషేక్ శర్మ బ్రేక్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య జరుగుతున్నటువంటి T20 సిరీస్ లో భాగంగా మూడు మ్యాచ్లను గెలిచి భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది. త్వరలో జరగబోయే ఎటువంటి టి20 వరల్డ్ కప్ లో కూడా భారత్ ఇలాంటి ఫామ్ నే కొనసాగిస్తే ఇక భవిష్యత్తులో టీమిండియా కు తిరుగుండదు.
