ఆంధ్రప్రదేశ్ రాజకీయం :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా మళ్లీ గేరు మార్చారు. 2019లో ఎలక్షన్లకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రతోనే జనం గుండెల్లోకి చేరారు. జనంతో మమేకం అవ్వడం.. వారి కష్టాలను నేరుగా తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేశారు. చివరికి ఆ పాదయాత్ర కారణంగానే జగన్ కి ముఖ్యమంత్రి అధికారం వచ్చింది.

ఒకే ఒక్క పాదయాత్రతో జగన్ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు . ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు పాదయాత్ర చేసిన ఏ నాయకుడు కూడా ఓడిపోవడం జరగలేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తేనే అధికారం వస్తుంది అని ముద్ర పడిపోయింది. ఈ క్రమంలోనే 2024 ఎలక్షన్లలో ఓడిపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత నిశ్శబ్దంగా ఉంటూ.. అప్పుడప్పుడు కొన్ని ప్రెస్ మీట్ లు పెడుతూ జనం ముందుకి వచ్చారు. ఒక్కసారిగా ఇప్పుడు గేరు మార్చేశారు.

2029 ఎన్నికల టార్గెట్గా చేసుకొని త్వరలోనే పాదయాత్ర చేస్తాను అని నిర్ణయించారు. మరోసారి అధికారంలోకి రావాలి అంటే కచ్చితంగా పాదయాత్ర చేయాల్సిందే అని డిసైడ్ అయిపోయారు. ప్రస్తుతం పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేసేందుకు ప్రతి వారం కూడా ఒక నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ కావాలి అని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. వరుస ఓటములతో అలాగే కార్యకర్తలపై కేసులతో పూర్తి నిరాశలు ఉన్నటువంటి వైసీపీ శ్రేణుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం కొత్త ఉత్సాహాన్ని నింపింది . ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పై ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వస్తుంది అని.. చంద్రబాబు మోసాలను ప్రజలు గుర్తించారు అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇదే పదునుగా తీసుకొని మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే 2017లో పాదయాత్ర చేసిన విధంగానే.. 29 ఎలక్షన్లకు ముందు పాదయాత్ర చేస్తాను అని తెలిపారు.

