స్వస్తిక్ న్యూస్, పుల్లలచెరువు :- జనసేన పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకొని 13 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా, ఈరోజు ఉదయం పుల్లల చెరువు బస్టాండ్ సెంటర్ లో , సాయంత్రం 6 గంటలకు మర్రివేములలోని వంగవీటి రంగా విగ్రహం వద్ద జనసేన పార్టీజెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుందని మండల జనసేన కన్వీనర్ కొఠారి అచ్చయ్య తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పుల్లలచెరువు మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆయన కోరారు.