స్వస్తిక న్యూ్స్, స్పోర్ట్స్:- ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మరియు పంజాబ్ కింగ్స్ (PBKS) జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే వర్షం కురవడంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.
మ్యాచ్ తాజా అప్‌డేట్స్:- నిలిచిన సమయం: మ్యాచ్ 3.4 ఓవర్ల వద్ద ఉండగా భారీ వర్షం మొదలైంది.
ప్రస్తుత స్కోరు: ఆట నిలిపివేసే సమయానికి KKR జట్టు 2 వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది.
వికెట్ల వివరాలు:- అలెన్: 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
గ్రీన్: 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
బౌలింగ్ ప్రదర్శన: పంజాబ్ బౌలర్ బార్ట్లెట్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఈ రెండు వికెట్లను పడగొట్టాడు.

గ్రౌండ్ పరిస్థితి:-భారీ వర్షంకారణంగా మైదానం తడవకుండా గ్రౌండ్ స్టాఫ్ తక్షణమే స్పందించి, పిచ్‌తో పాటు మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పివేశారు. వర్షం తగ్గుముఖం పడితేనే మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అభిమానులు మ్యాచ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు