Monday, 16 March 2026
Swasthik News
Home / రాజకీయం

కూటమిపై కొడాలి ఫైర్.. 2029లో జగన్ సీఎం కావడం తథ్యం!

02 Mar 2026
01:40 PM
576

స్వస్తిక్ న్యూస్,ఆంధ్రప్రదేశ్ :-  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార మరియు ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య ప్రతిరోజు కూడా మాటలు యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా కూటమి నేతలకు భయపడే ప్రసక్తి లేదని.. కూటమి బెదిరింపులకు ఎవరూ భయపడేవారు లేరు అని వైసిపి నేత కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు.

Article Image

తాజాగా అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన కొడాలి నాని అనంతరం మీడియా వేదికగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబు ఎప్పుడూ కూడా ఎవరిని దూషించలేదు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కావాలనే అతన్ని రెచ్చగొట్టారు అని పేర్కొన్నారు. అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పిన కూడా అతని ఇంటి పై దాడి చేయడం అనేది దారుణమని అన్నారు.

Article Image

ఇక లోకేష్ నడిపేటువంటి రెడ్ బుక్ రాజ్యాంగానికి కూడా వైసిపి తలోగ్గే ప్రసిద్ధి లేదు అని వ్యాఖ్యానించారు. ఇక చివరిగా రాబోయే ఎలక్షన్లలో వైసిపి పార్టీ అధికారం చేపడుతుంది అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం తథ్యం అని తెలిపారు. రెడ్ బుక్ లో జగన్ పేరు ఉంటే అది అటు తిరిగి.. ఇటు తిరిగి లోకేష్ కే ఇబ్బందిగా మారుతుంది అని కొడాలి నాని తీవ్రంగా హెచ్చరించారు. 

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!