Thursday, 23 July 2026
SWASTHIK NEWS
Home / ఆంధ్రప్రదేశ్

కృష్ణమ్మ పరవళ్లు.. ఆగస్టు తొలివారంలో శ్రీశైలానికి వరద గండం వీడేనా?

22 Jul 2026
12:49 PM
41

స్వస్తిక్ న్యూస్, ఆంధ్రప్రదేశ్:-ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది.​కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్ట్ వేగంగా నిండుతోంది. ఆల్మట్టి జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 100 టీఎంసీలు దాటింది.డ్యామ్‌ల వివరాలు & నీటి విడుదల ఆల్మట్టి ప్రాజెక్టు ఆల్మట్టి నిండటంతో అధికారులు దిగువన ఉన్న నారాయణపూర్ జలాశయానికి 25,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.​నారాయణపూర్ జలాశయం ఇక్కడి నుండి జూరాల ప్రాజెక్టుకు 7,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.నిపుణుల అంచనా ఎగువన ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ మరియు నీటిపారుదల శాఖ నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్రవాహం ఇలాగే కొనసాగితే, ఈ నెల ఆఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. దీంతో శ్రీశైలం జలాశయం వైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కనుంది.

Swasthik News

Share this Article

Chenna

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates