Wednesday, 22 July 2026
SWASTHIK NEWS
Home / తెలంగాణ

తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు

06 Apr 2026
05:12 PM
36

స్వస్తిక్ న్యూస్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్రంలోని మద్యం ప్రియులకు షాక్ ఇచ్చే వార్త ఇది. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల ధరలు పెంచాలని డిస్టిలరీల యజమాన్యాల నుంచి వచ్చిన ఒత్తిడితో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది.12-15% ధరల పెంపు: మద్యం ధరలను 12 శాతం నుండి 15 శాతం వరకు పెంచాలని బ్రూవరీస్ ప్రతిపాదించాయి. ఈ పెంపునకు సంబంధించిన ప్రతిపాదనల ఫైల్‌ను ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో కూడిన జ్యుడీషియల్ కమిటీకి పంపింది.ధరల పెంపు సాధ్యాసాధ్యాలపై వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కమిటీని ప్రభుత్వం కోరింది.​మద్యం తయారీకి అవసరమైన ముడిసరుకు మరియు ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా పెరిగాయని, అందువల్ల ధరలు పెంచడం తప్పనిసరి అని డిస్టిలరీల యజమాన్యాలు ఇటీవల ప్రభుత్వాన్ని కోరాయి.

Article Image

వచ్చే నెల నుంచే కొత్త ధరలు..? 

జ్యడీషియల్ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. అంతా అనుకున్నట్లు జరిగితే, వచ్చే నెల నుండే రాష్ట్రంలో కొత్త మద్యం ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates