Monday, 16 March 2026
Swasthik News
Home / జాతీయ వార్తలు

చంద్రగ్రహణం ఎఫెక్ట్.. ఆలయాలన్ని మూసివేత, ఆ ఒక్కటి తప్పా!

03 Mar 2026
10:01 AM
476

స్వస్తిక్ న్యూస్, జాతీయం :-  ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఇవ్వాళ చంద్రగ్రహణం కారణంగా అన్ని ఆలయాలు కూడా మూసి వేయబడనున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ఆలయం మాత్రం చంద్రగ్రహణం ఎఫెక్ట్ ఉన్నా కానీ మూసివేయరు. చంద్రగ్రహణం కారణంగా ఇవ్వాళ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దర్శనాలను ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు నిలిపివేయనున్నారు.

Article Image

మరోవైపు తెలంగాణలో ప్రసిద్ధిగాంచినటువంటి యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయాన్ని ఉదయం 7 గంటలకే మూసివేస్తున్నాము అని తిరిగి బుధవారం ఉదయం తెరవనున్నట్లుగా పూజారులు వెల్లడించారు. కాబట్టి   హోలీ ఉత్సవాలను నిన్న సాయంత్రమే నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాళహస్తి ఆలయం మాత్రం ఇవ్వాళ తెరిచే ఉంటుంది అని ఆలయ అధికారులు తెలిపారు.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!